- సమ్మక్క, సారలమ్మల ఆలయం సందర్శన
- కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ సమ్మక్క సారలమ్మల ఆలయం దర్శించుకున్నారు. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క దేవాల ప్రాశస్త్యాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ సమ్మక్క సారలమ్మల దేవాలయాన్ని దర్శించుకుని వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం తనను ఎంతో ప్రభావితం చేసిందని అందుకే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల అభివృద్ధి, అంతర్గత రోడ్ల నిర్మాణం వంటి పలు మౌలిక వసతుల కల్పకకోసం ప్రత్యేక శ్రద్ధ వహించి కొండపర్తిని అభివృద్ధి చేస్తామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. గవర్నర్ పర్యటనలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, జిల్లా కలెక్టర్‌టీఎస్.దివాకర్, ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ శబరీష్ తదితరులు ఉన్నారు.