పాకిస్థాన్‌లోని బలుచిస్తాన్‌లో జాఫర్ రైలును హైజాక్ ఘటనలో 27 మంది తిరుగుబాటుదారులు చనిపోయారు. సుమారు 155 మంది ప్రయాణికులను రక్షించారు. ఇంకా ఎంతమంది ఉన్నారనేది తెలియరాలేదు. ఘటనా స్థలం మస్కఫ్ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పది మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరి మిలిటెంట్‌ను హతమార్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
రిస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో పంజాబ్, సింధ్ ప్రాంతాల నుంచి బలోచిస్తాన్ వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ రోజు ఉదయం జాఫర్ రైలు నుంచి 57 మంది ప్రయాణికుల్ని రక్షించి… క్వెట్టా తరలించారు. మరో 23 మందిని మాచ్‌కు పంపించారు. సైనిక బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక, మిలిటెంట్లు చిన్న గ్రూపులుగా విడిపోయారు.
హైజాక్‌లో పాల్గొన్న వారు శాటిలైట్ ఫోన్లతో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడినట్టు పాక్ అధికార వర్గాలు వెల్లడించాయి. కొండలు, లోయ ప్రాంతాలు కావడంతో..ఘటనా స్థలానికి భద్రతా దళాలు వెళ్లటం దుర్లభంగా మారింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సానుభూతిపరులు ట్రాక్‌ను పేల్చివేశారు. క్వెట్టా నుంచి పెషావర్ రైలు బయలుదేరిన సమయంలో సుమారు 450 మంది ప్రయాణికులు ఉన్నారు.