బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్ అనిల్ తడానీ గారాల పట్టి రషా తడానీ 2005 మార్చి 16వ తేదీన జన్మించింది. ముంబైలో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న రషా టైక్వాండో మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రషా లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది.రషా తడానీ అసలు పేరు రషా విశాఖ తడానీ. 20 ఏళ్లకే తల్లి బాటలో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది
రషా తడానీ మొదటి సినిమా ఆజాద్. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కుమారుడు అమన్ దేవగన్ తో రషా జతకట్టింది.
జనవరిలో విడుదలైన ఆజాద్ సినిమా కలెక్షన్ల విషయం వదిలేస్తే రషాకు గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న OTT ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
రషా తెలుగులో రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా చేస్తోందని… ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోందని టాక్
ఆజాద్ సినిమాలోని ఉయ్ అమ్మ పాటతో రషా ట్రండింగ్ లోకి వచ్చింది. ఆ పాట సూపర్ హిట్ అయింది.
రవీనా ఆమె భర్త అనీల్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా 20 ఏళ్లకే కుమార్తెను రంగుల ప్రపంచంలోకి తీసుకొచ్చారు.
బాలీవుడ్ లో ఏ ఫంక్షన్ జరిగినా తల్లి రవీనా రషాతో దర్శనం ఇస్తోంది. కుమార్తె నిలదొక్కుకునే వరకు వెంట ఉండాల్సిందే అని రవీనా చమత్కరిస్తోంది.
మొదటి సినిమాతో క్రేజీగా మారిన రషా తన నటనతో విమర్శకులను మెప్పించిందట. ప్రస్తుతం మరో సినిమాకు సిద్దమైన రషా ఫ్యాషన్ షోల్లో అదరగొడుతోంది.
courtesy : instagram