ఛాంపియన్స్ ట్రోఫీతో టీమిండియాలోని సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలకు తలకిందులు చేసేశారు ఈ ప్లేయర్లు. ట్రోఫీ గెలవగానే ఫుల్ జోష్ మోడ్‌లోకి వచ్చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక రిటైర్మెంట్ గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు.
ముఖ్యంగా రోహిత్ శర్మ మ్యాచ్ అయిపోగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ జోరుగా చర్చ నడిచింది. కానీ అన్ని రూమర్స్‌ను తీసుకెల్లి చెత్త బుట్టలో వేసేశాడు హిట్ మ్యాన్. ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దు..రిటైర్మెంట్ అనే కాన్సెప్టే లేదని తేల్చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్. అత్యంత కీలకమైన 76 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా గెలుపు సులువైంది. లేదంటే మరింత కష్టాల్లో పడేది టీమిండియా. కోహ్లీ మాత్రం ఫైనల్స్‌లో నిరాశపరిచాడు. కేవలం ఒక రన్‌కే వెనుదిరిగాడు.
నిజానికి రోహిత్, కోహ్లీ, జడేజా వన్డేలకు కూడా గుడ్‌బై చెప్తారనుకున్నారంతా. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ సీనియర్లు. ఈసారి కూడా అలాంటి సీనే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తమలో ఇంకా ఆట మిగిలే ఉందని చెప్పకనే చెప్పారు ఈ సీనియర్లు.