24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

45 రోజుల్లో 600 టన్నుల వ్యర్ధాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరిగిన కుంభమేళాకు..దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పులకించిపోయారు. 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో..66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం తీరంలో భారీగా వ్యర్థాలు పోగుబడ్డాయి. ఇప్పుడు వీటిని తొలగించే ప్రయత్నాలను చేపట్టింది..యోగి సర్కారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన క్లీన్‌నెస్‌డ్రైవ్‌లో వేలమంది పారిశుద్ధ్య కార్మికులు, గంగా సేవా దూతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా సంగం ఘాట్లు, మేళా గ్రౌండ్ రోడ్లు, పర్మనెంట్, టెంపరరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను శుభ్రం చేస్తున్నారు. అలాగే.. తాత్కాలిక పైప్ లైన్లు, స్ట్రీట్ లైట్లు, టెంట్లు, పెవిలియన్లను తొలగిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక జరిగిన త్రివేణి సంగమ ప్రాంతంలో..నదిలో తేలుతున్న 600 టన్నుల వ్యర్థాలను సేకరించారు. ప్రభుత్వం ఈ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తోంది. పర్యావరణానికి హాని కలగని విధంగా వాటిని నిర్మూలిస్తోంది. రెండున్నర కిలోమీటర్ల మేర జరుగుతున్న కుంభమేళా క్లీనింగ్‌ డ్రైవ్‌లో.. 83 భారీ డ్రెడ్జింగ్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఆరు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక, వ్యర్థాలను తొలగించారు. దాంతో  నదీ ప్రవాహం మెరుగుపడింది. కుంభమేళా ప్రాంతంలో వెయ్యి టెన్నిస్‌ కోర్టులకు సమానమైన ప్రాంతాన్ని పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేశారు. మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన లక్షన్నర తాత్కాలిక మరుగుదొడ్లను స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను క్రమపద్ధతిలో ప్రాసెస్ చేసి నైనిలోని బస్వర్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. మరోవైపు కుంభమేళాలో 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించిన్‌ క్లీన్‌డ్రైవ్‌..రికార్డు సృష్టించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com