ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ ఫైట్‌కు రెడీ అవుతోంది టీమిండియా. ఇప్పటి వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి జోష్ మీద ఉంది రోహిత్ సేన. అయితే ఇప్పటికీ కొన్ని భయాలు టీమిండియా అభిమానులను వదలడం లేదు. ఎందుకంటే టీమిండియా ఆట ఒక్కోసారి పేకమేడను గుర్తు చేస్తుంది. అందుకే ఫ్యాన్స్‌ను ఇప్పుడు కొన్ని విషయాలు వెంటాడుతున్నాయి.
ఓపెనర్స్ నిలదొక్కుకోవాల్సిందే..
టీమిండియా ఓవరాల్‌గా చూస్తే చాలా బలంగానే కనిపిస్తోంది. కానీ ఓపెనర్స్ విషయంలో కాస్త తడబడుతోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగాక పెద్దగా పాట్నర్షిప్లు నమోదు చేయడం లేదు. దీంతో ఈ భారాన్ని మిడిల్ ఆర్డర్ మోయక తప్పడం లేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ సెంచరీతో రాణించాడు. కానీ ఆ తర్వాత తనదైన శైలి ఆటను పూర్తిగా చూపించలేకపోయాడు. ఇక రోహిత్ కూడా మొదట్లో బౌలర్లపై అటాక్ చేస్తూ కాస్త ఒత్తిడి పెంచుతున్నాడు. కానీ దానిని కొనసాగించలేకపోతున్నాడు. ఫైనల్స్‌లో మాత్రం వీరిద్దరు నిలదొక్కుకోవాల్సిందే. లేదంటే మ్యాచ్‌లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
కోహ్లీ మాయ చేయాల్సిందే..
విరాట్ కోహ్లీ టీమ్‌లో ఎందుకు ఉండాల్సిన అవసరం ఉందనేది ఇప్పటికే ప్రూవ్ చేశాడు. తనదైన ఆటతో మ్యాచ్‌లను మలుపు తిప్పాడు కోహ్లీ. సెమీస్‌లో కూడా ఆస్ట్రేలియాపై 84 పరుగులతో చెలరేగిపోయాడు. ఫైనల్స్‌లో కూడా తన నుంచి మెరుగైన ఆటను అంతా కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో ఎలాగైతే మ్యాచ్‌ను మలుపుతిప్పాడో.. ఈసారి కూడా అదే మ్యాజిక్‌ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
రచిన్, విలియమ్స్‌ను కట్టడి చేయాల్సిందే..
ప్రస్తుతం కివీస్ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. రచిన్ రవీంద్రా, కేన్ విలియమ్సన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు క్రీజులో నిలదొక్కుకుంటే పరుగుల వరద పారడం ఖాయం. ఇక ఆఖర్లో ఫిలిప్స్, మిచెల్ కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. రచిన్ అటాక్‌ను, విలియమ్సన్ పద్ధతైన ఆటను అడ్డుకోకపోతే భారత్‌కు కష్టాలు తప్పవు. భారత్ కొత్త బాల్తోనే వికెట్లు తీయకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. రచిన్ ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా అందులో రెండు సెంచరీలు చేశాడు. ఈ విషయం టీమిండియా మర్చిపోవద్దు.
స్పిన్‌ను అడ్డుకోకపోతే..
దుబాయ్ పిచ్‌లు కాస్త స్లోగా ఉంటాయి. స్పిన్నర్లకు అనుకూలమనే చెప్పాలి. అందుకే టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఇక కివీస్ కూడా ఈ విభాగంలో బలంగానే కనిపిస్తోంది. శాంట్నర్ మ్యాచ్‌లను మలుపు తిప్పేస్తున్నారు. రచిన్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా ఆచితూచి ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈసారి స్పిన్నర్లు ఎంతమంది?
స్పిన్నర్ దళం టీమిండియా గెలుపులో కీ రోల్ ప్లే చేస్తుంది. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం మకుటం లేని మహారాజుగా మారాడు. ఇక అక్షర్, కుల్దీప్, జడేజా కూడా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో వీరి నుంచి మ్యాజిక్‌ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.