ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ ఫైట్‌కు రెడీ అవుతున్న న్యూజిలాండ్ భారత్‌పై మైండ్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ టీమ్ కెప్టెన్ శాంట్నర్ చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహారణ. దుబాయ్ పిచ్‌లు భారత్‌కు అనుకూలం ఇప్పటి వరకు ఇంగ్లండ్, ఆసీస్ మాజీలే అనుకుంటే ఇప్పుడు కివీస్ కెప్టెన్ కూడా ఇదే మాట అనేశాడు.
టీమిండియా అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడింది…అక్కడి పిచ్ పరిస్థితి వారికి బాగా తెలుసు.. మ్యాచ్‌లో పిచ్ గురించి క్లారిటీ ఉండటం కాస్త కలిసి వస్తుంది అనే స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు శాంట్నర్. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చాడనేది ఇప్పుడు చర్చ. నిజానికి లీగ్ దశలో భారత్ చేతిలో ఓడింది టీమిండియా. అందుకే ఇప్పటి నుంచే భారత్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.
అంతేకాదు దుబాయ్, పాకిస్థాన్ మధ్య చక్కర్లు కొట్టడంపై కూడా ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడాడు శాంట్నర్. ఇదంతా టోర్నీలో భాగమే అనుకుంటామని.. పాకిస్థాన్, దుబాయ్‌లోని అన్ని ప్రదేశాలను చుట్టేశామని చెప్పుకొచ్చాడు. తమ ప్లేయర్సంతా ఇదంతా ఆటలో భాగమే అనుకుంటున్నారని చెప్పాడు. సో ఇదంతా చూస్తుంటే భారత్ వల్లే ఇదంతా జరిగిందని.. భారత్‌కు దుబాయ్ అనుకూలమని చెప్పకనే చెబుతున్నాడు శాంట్నర్.
నిజానికి శాంట్నర్‌కు నిజంగా తెలియదో.. లేక తెలిసినా కావాలనే మర్చిపోయినట్టు నటిస్తున్నాడో తెలియకదు కానీ.. గ్రౌండ్ ఒకటే అయినా.. ఇండియా ఆడే పిచ్ మాత్రం వేరు వేరు అనే చెప్పాలి. దుబాయ్ గ్రౌండ్‌లో ఐదు నుంచి ఆరు పిచ్‌లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మ్యాచ్ ఏ పిచ్‌పై ఆడతారనేది తెలియని పరిస్థితి. మరి ఇది భారత్‌కు అనుకూలమని ఎలా తేల్చారో శాంట్నర్ మరి.