- సీసీ కెమెరాల పరిశీలన
- ప్రజల్లోకి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు
తిరుపతి నగరంలో పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. గురువారం రాత్రి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి రైల్వేస్టేషన్‌లో పాటు మహిళా పోలీస్ స్టేషన్, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లన తనిఖీ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్ కర్ణాల వీధి నుంచి పూర్ణ కుంభం సర్కిల్ వరకూ ఏర్పాటు చేసిన 19 సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ పరిశీలించారు. అలాగే భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను కూ ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల క్వాలిటీకి సంబంధించి అడిగి తెసుకున్నారు. వీడియో క్లారిటీగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన సహించేది లేదని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. సీసీ టీవీల పరిశీలన అనంతరం కనక భూషణం లేఔట్ లో గల పద్మావతి పార్కు, గోపాల్ రాజ్ కాలనీ, సీతమ్మధార రోడ్డు, శాంతినగర్ కాలనీల్లో పర్యటించి స్థానికంగా ప్రజలతో మాట్లాడారు. తిరుపతిలో పోలీసింగ్ పనితీరు ఎలా ఉంది..? ప్రతిరోజు రాత్రి సమయంలో నైట్ బీట్ పోలీసులు వస్తున్నారా..? లేదా .? అనే విషయాలని కాలనీలో మహిళలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ఆకతాయిలు ఎవరైనా అల్లరి చేయడంలాంటివి ఉంటే వెంటనే తమ దృష్టి తీసుకురావాలని మహిళలకు సూచించారు. పోలీస్ పరంగా మీకు ఎమైన సమస్యలు ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. స్ధానిక పోలీసులు స్పందించని పక్షంలో ఫోన్ ద్వారా గాని స్వయంగా తన కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని కాలనీ వాసులకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు. ప్రశాంతతకు నిలయమైన తిరుపతిలో ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ బీ.హేమంత్, అదనపు ఎస్పీ కె.రవి మనోహరాచారి, తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత, సీఐ సాధిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.