36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

భారత్‌పై టారిఫ్‌ల వడ్డింపు.. ముహూర్తం ఏప్రిల్ 2

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముహూర్తం ఖరారు చేశారు. ఇక ఆ రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలపై అమెరికా పెంచిన టారిఫ్‌లు అమల్లోకి వస్తాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఈ విషయాన్ని జాయింట్ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించారు. దీంతో ఇప్పుడు భారత్‌లో ఓ కొత్త అలజడి ప్రారంభమైనట్టే అని చెప్పాలి.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్‌లో ప్రసంగించారు ట్రంప్. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో చాలా మార్పు వచ్చిందని.. తాను చేసిన గొప్ప పనుల గురించి చెప్పుకొచ్చారు ట్రంప్. పనిలో పనిగా టారీఫ్‌ల గురించి కూడా అనౌన్స్ చేశారు. భారత్, చైనా సహా అనేక దేశాలపై విధించిన, విధించబోతున్న టారిఫ్‌లో ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.

భారత్‌ను టారిఫ్‌ కింగ్‌గా అభివర్ణిస్తారు ట్రంప్. భారత్ సహా ఈయూ, బ్రెజిల్, చైనా వంటి దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని చెబుతున్నారు. స్పెషల్‌గా భారత్ అయితే 100 శాతం కంటే ఎక్కువ టారిఫ్‌లు విధిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు ఏ దేశం అమెరికాపై ఎంత టారిఫ్‌ విధిస్తే.. తాము కూడా అంతే టారిఫ్‌ విధిస్తామని చెబుతున్నారు ట్రంప్. ఇదే విషయాన్ని అమలు చేస్తే భారత్‌కు మొదట్లో భారీగానే నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ట్రంప్ అనౌన్స్ చేసిన డేట్‌కు అటు ఇటుగా ఇంకా నెల రోజుల సమయం ఉంది. మరి ఈలోపు భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా విధించిన టారిఫ్‌లకు కౌంటర్‌గా కెనడా, మెక్సికో, చైనా కౌంటర్ అటాక్స్ ప్రారంభించాయి. మరి భారత్ కూడా అలానే విధించి వారి సరసన చేరుతుందా? లేక కర్ర విరగకుండా.. పాము చావకుండా ఆలోచనతో అడుగులు వేస్తుందా? అనేది చూడాలి.

ప్రస్తుతం ప్రపంచంమంతా డాలర్ పెత్తనం నడుస్తోంది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని తీసుకురావాలని డిసైడ్ అయ్యాయి. అయితే దానికి ససేమీరా అంటున్నారు ట్రంప్. అలా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పెత్తనం తమ వద్దే ఉండాలి.. మేం చెప్పిందే వినాలి అనే ధోరణిలో ముందుకు వెళుతున్నారు ట్రంప్. ట్రంప్ వరుస పరిణామాలను చూస్తున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com