విరాట్ కోహ్లీ.. రికార్డులకు రారాజు. లెటెస్ట్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. ఛేజింగ్‌లో మరో మైలురాయిని క్రాస్ చేశాడు. ఛేజింగ్ మ్యాచ్‌లో 8 వేల పరుగులను దాటేశాడు కోహ్లీ. మాములుగానే టీమిండియా ఛేజింగ్ చేసేప్పుడు కోహ్లీ క్రీజులో ఉంటే ఆ భరోసానే వేరు. అయితే ఈ మధ్య అది కాస్త తగ్గింది. కానీ ప్రస్తుతం మళ్లీ పాత కోహ్లీ కనిపిస్తున్నాడు. అందుకే తన పరుగుల దాహాన్ని తీర్చుకునేందుకు పరుగులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 8 వేల పరుగులను దాటేశాడు. ఇక్కడ మరో హైలేట్ అయిన విషయం ఏంటంటే.. ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన టాప్ 3 బ్యాట్స్‌మెన్ ఇండియన్ ప్లేయర్లే కావడం విశేషం.
ఈ లిస్ట్‌లో 8,720 పరుగులతో క్రికెట్ గాడ్ సచిన్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. 8,063 పరుగులతో కోహ్లీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్‌లో 6,115 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నాడు. వీరి తర్వాత జయసూర్య 5,742 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇవేకాదు కోహ్లీ మరికొన్ని అద్భుతాలు కూడా చేశాడు. కోహ్లీ ఆడిన మూడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఇవన్నీ కూడా ఛేజింగ్‌లోనే. ఇక ఐసీసీ ఈవెంట్స్‌లో 24 సార్లు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 23 హాఫ్ సెంచరీలతో సచిన్ పేరుపై ఉంది.
ఇక కోహ్లీ ఫిల్డింగ్ విషయంలో కూడా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అజారుద్దీన్ 334 వన్డేల్లో 156 క్యాచ్‌లు పట్టగా.. కోహ్లీ నిన్న 161 క్యాచ్‌లు పట్టేశాడు. ఓవరాల్‌గా చూస్తే ఇప్పుడు వరల్డ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు కోహ్లీ. ఇప్పటి వరకు 160 క్యాచ్‌లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు రికీ పాంటింగ్. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో 218 క్యాచ్‌లతో మహేళ జయవర్ధనే ఉన్నాడు.