27.8 C
Hyderabad
Tuesday, August 11, 2026

Live Video

spot_img

రోహిత్‌ ఫ్యూచర్‌పై గంభీర్ కీలక కామెంట్స్..

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. మార్చి 9న ఫైనల్ ఫైట్‌కు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌ నడుస్తోంది. అప్పుడు అడిగాడు ఓ జర్నలిస్ట్.. రోహిత్‌ ఫామ్, అతని ఫ్యూచర్‌ ఏంటి అని? అసలు రోహిత్ ఇంకెంత కాలం ఆడతాడు అని?

మాములుగానే గంభీర్ చాలా ముక్కుసూటి మనిషి. మంచైనా, చెడైనా మొఖం మీదనే చెప్పేస్తాడు. ఈ క్వశ్చన్‌కు కూడా అలానే చెప్పేశాడు. ఇప్పుడు మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడబోతుంది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి. కెప్టెన్ ఒక టెంపోలో మ్యాచ్‌ను ప్రారంభిస్తుంటే అంతకంటే ఎక్కువేం కావలి. మాకు టీమ్‌ మొత్తానికి ధైర్యం ఇచ్చే కెప్టెన్ కావాలి. రోహిత్‌ దాన్ని చేస్తున్నాడు. మీరు రన్స్ చూసి మనిషిని అంచనా వేస్తారు.. మేం అతను టీమ్‌పై చూపే ఇంపాక్ట్ చూసి అంచనా వేస్తాం. ఇదే మీకు మాకు తేడా.. అన్నాడు.

అంతేకాదు జర్నలిస్టులు, అనలిస్ట్‌లు చూసే కోణం వేరు.. మేం చూసే కోణం వేరు.. ఓ కెప్టెన్ ముందుండి ఇంత ధైర్యంగా నడిపిస్తుంటే.. మాకు అంతకంటే కావల్సింది ఇంకేముంది అనేశాడు.

ఈ సమాధానంతో గంభీర్‌ ఏం చెప్పాలనుకున్నాడో .. క్లియర్ కట్‌గా చెప్పేశాడు. రోహిత్‌ ఎన్ని రన్స్ చేశాడనేది కాదు.. అతను టీమ్‌లో ఉండి చూపే ఇంపాక్ట్ చాలు అంటున్నాడు గంభీర్. నిజానికి రోహిత్‌ శర్మ గడచిన ఐదేళ్లలో మూడు సెంచరీలు మాత్రమే చేశాడు. కానీ ఓపెనర్‌గా బరిలోకి దిగి అతను బౌలర్లపై చేసే అటాక్ మాత్రం మొత్తం టీమ్‌కు ఓ ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది.

అయితే గంభీర్ ఇక్కడ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేం ఇప్పటి వరకు ఓ పర్‌ఫెక్ట్ గేమ్ ఆడలేదన్నాడు గంభీర్. ఇంకో మ్యాచ్ మిగిలిఉంది కాబట్టి..పర్‌ఫెక్ట్ గేమ్ ఆడే చాన్స్ వస్తుందని అంచనా వేశాడు. వరుసగా గెలిచినా.. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉందంటున్నాడు గంభీర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com