38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

మళ్లీ కంపించిన నేపాల్

నేపాల్‌ మరోసారి కంపించింది. గత నెలలో మిగిల్చిన విషాదాన్ని మర్చిపోకముందే.. మరోసారి కంపించింది నేపాల్‌. ఈసారి రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అయితే ఈసారి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. నేపాల్‌లో తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య భూమి కంపించింది. దాదాపు 35 సెకన్ల పాటు భూమి కంపించడంతో… ఇంట్లో నుంచి ప్రజలంతా బయటకు పరుగులు పెట్టారు.

ఈ భూకంపం ఎఫెక్ట్‌ బీహార్‌పై కూడా పడింది. బీహార్‌లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ముఖ్యంగా పాట్నా దాని పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనల వల్ల కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఏడాది హిమాలయన్ రీజియన్‌లో ఇప్పటి వరకు ఆరు భూకంపాలు వచ్చాయి. ఇందులో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కూడా ఉంది. ఈ ప్రకంపనల కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమవ్వగా.. వంద మందికిపైగా మృతి చెందారు.

నేపాల్ ఫాల్ట్ లైన్‌పై ఉండటం… ఇక్కడ ఇండియన్​ టెక్టానిక్ ప్లేట్- యురేషియా ప్లేట్‌​లోకి నెడుతుంది. దీంతో క్రమం తప్పకుండా భూకంపాలు వస్తున్నాయి. ఈ మధ్య వీటి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది.

ఈ భూకంపాల ఎఫెక్ట్‌ భారత్‌పై కూడా పడుతోంది. భూకంపం వచ్చిన ప్రతిసారీ ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రకంపనలు రావడం సర్వసాధారణంగా మారింది. ఈ భూకంపాల కారణంగా నేపాల్‌ ఇప్పటికే చాలా నష్టాన్ని చవి చూసిందనే చెప్పాలి. 2015లో నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది మరణించగా, 22 వేల మందికి పైగా గాయపడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com