ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మైనింగ్‌లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మైనింగ్ శాఖకు సంబంధించిన అంశాలపై ఢిల్లీలో మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గనుల శాఖలో నూతన పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్-2023 లోనూ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా ఎక్స్ ప్లొరేషన్ లైసెన్స్ ప్రొవిజన్స్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు. క్రిటికల్ మినరల్స్ యావరేజ్ సేల్ ప్రైస్ ను క్యాలుక్యులేట్ చేసేందుకు ప్రత్యేక మెథాలజీ రూపకల్పనమైన దృష్టి సారించామని చెప్పారు. 12 ఖనిజాల రాయల్టీని పెంచామన్నారు. ఈ యేడాది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 448 ప్రాజెక్టుల్లో గనుల అన్వేషణ చేపట్టిందని పేర్కొన్నారు. వీటిలో 195 క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు. గనుల అన్వేషణలో ఇకపై ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది 12 ప్రైవేట్ కంపెనీలు గనుల అన్వేషణలో భాగస్వామ్యం అయ్యాయని ఆయన తెలిపారు.
ఆఫ్ షోర్ ఏరియాలో ఖనిజాల ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు కిషన్‌రెడ్డి. పలు ఆఫ్ షోర్ మినరల్స్ గుర్తించి వేలం వేయబోతున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 103 బ్లాకుల గనులను వేలం వేశాయని.. ఈ వేలం ప్రక్రియలో 14 రాష్ట్రాలు భాగస్వామ్యం అయ్యాయని తెలిపారు. వాటిలో 27 బ్లాక్స్‌కు సంబంధించిన లీజ్ డీడ్స్ ఇచ్చేశామని, వాటిలోనూ 8 బ్లాక్స్‌లో మినరల్ ప్రొడక్షన్ కూడా ప్రారంభమైందన్నారు. తెలంగాణ, బిహార్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటిసారి మినరల్ బ్లాక్స్ వేలం ప్రారంభమైందన్న కిషన్‌రెడ్డి.. భారతదేశపు మినరల్ ఆక్షన్ మ్యాప్‌లో మొత్తం 14 రాష్ట్రాలు భాగస్వామ్యమయ్యాయని చెప్పారు. అస్సాం లోనూ మినరల్ బ్లాక్స్ ఆక్షన్ కోసం నోటిఫై అయ్యాయని, వీటి వేలం కూడా త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. ఈ జాబితాలో త్వరలోనే.. జమ్మూ కశ్మీర్, కేరళ రాష్ట్రాలు కూడా చేరబోతున్నాయని చెప్పారు. మైనింగ్ వేలంలో రాష్ట్రాలు చేరడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఉపాధి పెరుగుతుందని, ప్రీమియం, రాయల్టీలు ద్వారా ఆదాయం పెరుగుతుందని, ఫలితంగా పారిశ్రామిక ప్రగతి మెరుగవుతుందన్నారు. ఈ పరిణామం ఆయా రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ఆక్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు మొత్తంగా.. రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి చేకూరిందిని కిషన్ రెడ్డి వివరించారు. మైనింగ్ సెక్టార్‌లో ఆత్మనిర్భరత సాధించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి పెట్టామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.