22.7 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

ఏపీలో మరో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌

ఆంధ్రప్రదేశ్‌‌లో మరో రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పెద్దఎత్తున రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.506 కోట్ల అంచనా వ్యయంతో కుప్పంలో రింగు రోడ్డు, అంతర్రాష్ట్ర రహదారుల అభివృద్ధికి, బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రింగ్ రోడ్డు, మిగిలిన పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. కుప్పం పట్టణానికి ఇన్నర్‌ రింగు రోడ్ నిర్మాణానికి రూ.54 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు అధికారులు. ప్రస్తుతం ఉన్న రోడ్లను మరో 5 కిలోమీటర్ల మేర నిర్మించి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారు. కుప్పం నియోజకవర్గంలో 11 బ్రిడ్జ్‌లను నిర్మించేందుకు 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.38.50 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే, నియోజకవర్గంలో 89 కిలోమీటర్ల రోడ్లను రూ.41.15 కోట్ల నాబార్డు నిధులతో అభివృద్ధి చేయనున్నారు. 67 కిలోమీటర్లున్న 8 రోడ్లను సీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.134 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. కుప్పం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంగా ఉండటంతో అంతర్రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ పెంచేందుకు రూ.178.51 కోట్లతో ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించామని అధికారులు చెబుతున్నారు. 43 కిలోమీటర్ల మేర రోడ్లను కూడా 5 పనులుగా మంజూరు చేయించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.

చంద్రబాబు నాయుడు గత యేడాది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు కుప్పంలో పర్యటించారు. ఆయనే స్వయంగా ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించారు. 27 కిలోమీటర్లున్న 5 రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు ఆ దరఖాస్తుల్లో కోరారు. ఈ విజ్ఞప్తులకు చంద్రబాబు సానుకూలంగా స్పందించగా.. ఆ రోడ్లకు రూ.58 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆ రోడ్ల నిర్మాణాలు కూడా తాజా ప్రతిపాదనల్లో పెట్టారు అధికారులు. అంతేకాదు.. కుప్పంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పనులపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. ఇటీవల నిధులు కూడా కేటాయించారు. తాజాగా రోడ్ల అంశంపై ఫోకస్ పెట్టారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com