34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

వైభ‌వంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి చక్రస్నానం

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అంత‌కుముందు అర్చకులు అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం తెలుగువారితో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని వేద పండితులు చెప్పారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ, పోలీసు శాఖ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆండాల్‌ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా…ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అన్నదాన కార్యక్రమం, సాయంత్రం కళా వేదిక ద్వారా శ్రీవారి వైభవాన్ని కీర్తిస్తూ సాగిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com