27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లండి – వైసీపీపై పవన్‌ కల్యాణ్‌ సెటైర్‌

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విచిత్ర ప్రకటన చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు.. గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాగానే పవన్‌ కల్యాణ్‌ మీడియా పాయింట్‌కు వచ్చి మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని సెటైర్‌ వేశారు. ఎందుకంటే వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జర్మనీలో మాత్రమే సాధ్యమవుతుందన్నారు.

అసలు అధికార తెలుగు దేశం పార్టీ తర్వాత సభలో ఎక్కువ స్థానాలు ఉన్న పార్టీ జనసేన అని, జనసేన ఉండగా.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జనసేన పార్టీ కంటే ఒక్కసీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్లన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఉన్నాయని, అది ఎవరి చేతుల్లో లేదని, సీఎం చంద్రబాబు చేతుల్లో కూడా లేదని, ఆ హోదా ప్రజలే ఇవ్వాలన్నారు. ఐదు సంవత్సరాల పాటు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని, అది గుర్తు పెట్టుకొని ప్రిపేర్‌ అవ్వాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com