భారత్-పాక్ మధ్య మ్యాచ్ లో ఎన్నో రికార్డులు క్రికెట్ అయ్యాయి. సూపర్ విక్టరీతో పాటు కొన్ని ఐసీసీ రికార్డులు బద్దలయ్యాయి. అంతేకాదు కొన్ని చెత్త రికార్డులు కూడా. అవేంటో చూద్దాం.
విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ పాక్ తో జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు కోహ్లీ. అంతేకాదు క్రికెట్ దిగ్గజం సచిన్ తర్వాత వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్ గా.. ఓవరాల్ గా వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన మూడో బ్యాటర్ గా రికార్డులు నమోదు చేశాడు. అంతేకాదు అత్యంత వేగంగా 14వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. వన్డేల్లో 14 వేల పరుగులు చేయడానికి సచిన్ టెండుల్కర్‌కు 350 ఇన్నింగ్స్ అవసరమైతే.. కోహ్లి 287వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్
1.సచిన్ టెండుల్కర్(ఇండియా)- 18426 రన్స్(452 ఇన్నింగ్స్)
2.కుమార్ సంగక్కర(శ్రీలంక)- 14234 రన్స్(380 ఇన్నింగ్స్)
3.విరాట్ కోహ్లి(ఇండియా)- 14000+ రన్స్(287 ఇన్నింగ్స్)*
4. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 13704 రన్స్(365 ఇన్నింగ్స్)
5. సనత్ జయసూర్య(శ్రీలంక)- 13430 రన్స్(433 ఇన్నింగ్స్).
ప్రస్తుతం విరాట్ ఒక్కడే మ్యాచ్ లు ఆడుతున్నాడు. మిగతా వారంతా రిటైర్ అయ్యారు.
క్యాచ్‌ల రికార్డ్..
టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా కోహ్లి నిలిచాడు. ఇక జాబితాలో ఓవరాల్‌గా శ్రీలంక స్టార్ మహేళ జయవర్దనే(218), ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్(160) ఈ జాబితాలో టాప్-2లో కొనసాగుతున్నారు.
వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు
1. విరాట్ కోహ్లి- 158
2. మహ్మద్ అజారుద్దీన్- 156
3. సచిన్ టెండుల్కర్- 140
4. రాహుల్ ద్రవిడ్- 124
5. సురేశ్ రైనా- 102.
టాస్‌ల విషయంలో చెత్త రికార్డ్
పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ వేయగా పాక్ కెప్టెన్ రిజ్వాన్ గెలిచాడు. దీంతో భారత్ వన్డే ఫార్మాట్లో వరుసగా టాస్‌లు ఓడిపోవడం ఇది 12వ సారి. అంతకుముందు నెదర్లాండ్స్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ కోల్పోయింది. ఇప్పుడు వరుసగా 12 సార్లు టాస్ ఓడిన భారత్ కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
రోహిత్ శర్మ కొత్త రికార్డు..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఓపెనర్‌గా రోహిత్ ప్రపంచ రికార్డు సాధించాడు. హిట్‌మ్యాన్ ఈ ఫీట్‌ను కేవలం 181 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 197 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్ గా 9వేల పరుగుల మైలురాయిని చేరగా . .తాజా మ్యాచ్ తో రోహిత్ ..సచిన్ రికార్డును బీట్ చేసి కొత్త రికార్డు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన ఆరో ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..
సచిన్ టెండూల్కర్-15310,
సనత్ జయసూర్య- 12740,
క్రిస్ గేల్-10179,
ఆడమ్ గిల్‌క్రిస్ట్- 9200,
సౌరవ్ గంగూలీ- 9146,
రోహిత్ శర్మ 9000.