23.4 C
Hyderabad
Friday, July 31, 2026

Live Video

spot_img

దాయాదుల సమరానికి వేళాయే..

ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా.. స్పెషల్‌గా టీమిండియా అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయేందుకు రెడీ అయ్యారు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఈ మాత్రం ఉంటుంది కదా. దుబాయ్ వేదికగా ఆదివారం జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఇప్పుడు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ మ్యాచ్‌ గెలిచి టీమిండియా జోరుపై ఉండగా.. తొలి మ్యాచ్‌ ఓటమితో దెబ్బ తిన్న పులిలా ఉంది పాకిస్థాన్. మరో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో తమ గణంకాలను సరి చేసుకుందామని టీమిండియా.. ఈసారి గెలిచి ఓ వైపు ఇండియా కొమ్ములను వంచడమే గాకుండా.. ఛాంపియన్స్ ట్రోఫీలో తమ సత్తా చాటాలని పాకిస్థాన్ టీమ్.. ఇలా రెండు టీమ్స్‌ సై అంటే సై అంటున్నాయి.

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే నరాలు తెగేంత ఉత్కంఠ ఉంటుంది. అది ఏ సిరీస్‌ అయిన ఈ ఇంటెన్సిటీ కామన్. అయితే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి పాకిస్థాన్‌ను లైట్ తీసుకునే చాన్స్ లేదు. ఎందుకంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఓడించి కప్పును ఎగురేసుకు పోయింది పాకిస్థాన్. అందుకే ఈసారి మరింత రసవత్తరంగా మ్యాచ్ జరగడం ఖాయం.

అయితే పాకిస్థాన్‌ను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆ టీమ్‌లో స్పిన్నర్లు లేని లోటు కనిపిస్తోంది. ఎందుకంటే టీమిండియా వద్ద స్పిన్నర్ల దళమే ఉంది. పాక్ టీమ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అబ్రార్ మాత్రమే ఉన్నాడు. పేస్ ప్రభావం కూడా మ్యాచ్ ప్రారంభంలోనే ఉంటుందని… మ్యాచ్ మొత్తం పేస్ ప్రభావం చూపించదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏ విభాగంలో చూసుకున్నా టీమిండియా ప్రస్తుతం బలంగా కనిపిస్తోంది. అయితే స్పిన్‌ను సరిగా ఆడలేకపోతున్న కోహ్లీకి అబ్రార్‌తో ముప్పు తప్పదని అనిపిస్తోంది. భారత్‌కు కొత్త స్పిన్నర్ అయిన అబ్రార్‌ను ఎలా ఆడతాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్.

ఇక పాక్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్‌ పాకిస్థాన్‌ టీమ్‌కు ప్రస్తుతం మెయిన్ పిల్లర్స్. బాబర్‌ ఓపెనర్ కాగా.. రిజ్వాన్‌ వన్‌డౌన్‌లో వస్తాడు. వీరిద్దరిని త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు మ్యాచ్‌పై కంట్రోల్ వస్తుంది. లేదంటే టీమిండియాకు ఒత్తిడి తప్పదు. అయితే పాక్ మిడిలార్డర్‌ కూడా చెలరేగితే చేసేదేం లేదు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో 35 పరుగులకే 5 వికెట్లు తీసిన మిడిలార్డర్ చెలరేగిపోయింది. దీంతో మ్యాచ్‌ టర్న్ అయ్యింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com