ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే హైఓల్టేజ్ ఉంటుంది. ఈ హీట్‌ను క్యాష్ చేసుకుంటాయి బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు. ఇలాంటి మ్యాచ్‌ల మధ్య స్పెషల్ రేట్లు చెల్లించి మరీ అడ్వర్టైజర్లు తమ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసుకుంటారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే అడ్వర్‌టైజింగ్ స్లాట్లు అన్నీ దాదాపుగా బుక్ అయిపోయాయి. కనెక్టెడ్ టీవీ, హెచ్‌డీ టీవీ, మొబైల్ యాడ్స్ కూడా బుక్ చేసేసుకున్నారు. నిజానికి ఈ టోర్నీలోని చాలా మ్యాచ్‌లకు రేట్లని స్థిరంగా ఉంచారు బ్రాడ్‌కాస్టర్లు. కానీ దాయాదుల పోరుకు మాత్రం ప్రకటనలు ఇవ్వాలనుకున్న వారికి వంద శాతం రేట్లు పెంచేశారు. ఈ సూపర్ క్లాష్‌ని క్యాష్ చేసుకునేలా 10 సెకన్ల యాడ్ ఖరీదు 50 లక్షలు. ఇది సాధారణ మ్యాచ్‌తో పోలిస్తే చాలా ఎక్కువ.
ఐసీసీ టోర్నీల్లో మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు రీచ్ ఎక్కువ. కొన్ని బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకునేందుకు ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తుంటాయి. అడ్వర్టైజింగ్ స్లాట్స్‌ని దక్కించుకునేందుకు తమ కాంపిటేటర్లతోనూ పోటీపడుతున్నారు. 10 సెకన్ల యాడ్ కోసం 50 లక్షలు చెల్లిస్తున్నారంటే హైప్, డిమాండ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోకాకోలా, అమూల్ డైరీ లాంటి అడ్వర్టైజర్లు కూడా.. ఈ మ్యాచ్ కోసం సరికొత్త యాడ్స్‌తో జనానికి రీచ్ అవ్వాలని చూస్తున్నారు. ఇండియా మొత్తం టీవీలకు, మొబైల్స్‌కి అతుక్కుపోయే సమయంలో తమ ఉత్పత్తుల్ని వారికి చేరువగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌తో.. బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు భారీగా ఆదాయం చేకూరనుంది. వీకెండ్ పైగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉండటంతో.. యాడ్ రేట్లని అమాంతం పెంచేశారు. పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 15 మ్యాచ్‌లున్నాయ్. ఇందులో ఇండియా-పాక్ మ్యాచ్ ఒక్కటే భారతీయ అడ్వర్టైజర్లకు టాప్ డ్రాగా కనిపిస్తోంది. టోర్నీ హైప్ పుంజుకునేందుకు.. ఈ మ్యాచే కీలకం అంటున్నారు. అందువల్ల సండే బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు.. యాడ్ స్లాట్స్ కోసం ప్రీమియం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడట్లేదు.