29.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం..?

బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.. మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.

దీంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనధికారికంగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.

కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లడానికి కారణం వైద్య పరీక్షలు కాదని గోపీనాథ్ ను పరామర్శించడానికని తెలుస్తోంది. కిడ్నీ సమస్యే కారణమా..? కొన్నాళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. కిడ్నీ ఫెయిల్యూర్ అని పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com