27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ఛాంపియన్స్ సమరం షురూ.. ఇండియా పరిస్థితేంటి?

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమైంది. ఐసీసీ ట్రోఫీ కోసం 8 టీమ్స్‌ బరిలోకి దిగాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగే ఈ ట్రోఫీలో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే. ఒక్క ఓటమి చాలు ఆ టీమ్‌ పరిస్థితిని మార్చేయడానికి. అందుకే టీమ్ ఇండియా ఇప్పుడు ట్రోఫీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఇందులో హాట్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది టీమ్ ఇండియా. 2017 చేజారిన కప్పును ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు మనవాళ్లంతా. అయితే అదంతా సులువేనా?

నిజానికి మెగా టోర్నీకి ముందు భారత ఆటగాళ్లకు రెస్ట్ బాగానే దొరికింది. వరుస సిరీసుల్లో ఘోర ఓటములు.. WTC నుంచి వైదొలగడం వల్ల టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌తో గెలవడం.. టీమ్‌లో కాస్త కాన్ఫిడెన్స్ పెంచింది. కానీ టీమ్‌లో నిలకడలేని ప్లేయర్స్ అయితే చాలా మందే కనిపిస్తున్నారు. అదే ఇప్పుడు కాస్త కలవరపెడుతోంది క్రికెన్‌ ఫ్యాన్స్‌ను.

బౌలింగ్‌లో బుమ్రా లేడనే దిగులైతే ఉంది. కానీ టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో దుర్భేద్యంగా కనిపిస్తుంది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌ తర్వాత భారత్‌ కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రతి ఫార్మట్‌కు ఓ వ్యూహం ఉంటుంది. దానికి అలవాటు పడాలంటే కనీస సన్నద్ధత తప్పనిసరి. అలాంటిది 2023లో జరిగిన వరల్డ్ కప్ తర్వాత.. అంటే ఏడాదిన్నరలో భారత్ కేవలం 9 వన్డే మ్యాచ్‌లే ఆడింది టీమిండియా.

టీమ్ ఇండియాను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఎవరిని ఏ ప్లేస్‌లో ఆడించాలి? అసలు మ్యాచ్‌లో ఎవరిని ఆడించాలి? అని. ఎందకంటే కేఎల్ రాహుల్ స్లాట్‌పై ఇంకా అనుమానాలే ఉన్నాయి. ఐదో స్థానంలో వస్తాడా? లేక ఏడో పొజిషన్‌లో ఆడిస్తారో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కోచ్ గంభీర్ మాత్రం ఎవరి పొజిషన్ కన్ఫమ్ కాదని.. గో విత్ ద ఫ్లో అంటున్నాడు. బౌలర్ల విషయంలోనే అదే కన్ఫ్యూజన్. టీమ్‌కి అనూహ్యంగా ఎంపికైన హర్షిత్ రాణా కూడా అద్భుతం చేస్తున్నాడు. అటు అర్షదీప్‌ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. దీంతో షమీతో ఎవరిని బరిలోకి దించాలనే ఆలోచనతో సెలక్టర్లు తలలు పట్టుకున్నారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పరిస్థితి కూడా అలానే ఉంది. దీంతో కుల్దీప్‌, వరుణ్‌ విషయంలో ఎవరిని ఫైనల్ చేయాలనేది అస్సలు అర్థం కావడం లేదు.

మొత్తానికైతే ప్రస్తుతం టీమ్ ఇండియా బలంగా కనిపిస్తోంది. అదే బలాన్ని ఉపయోగించుకొని గెలుస్తారా? లేదా? అనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com