38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

వైద్య, ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • రాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా నిధులు కేటాయిస్తాం

  • వైద్య, ఆరోగ్య శాఖ ప్రీ బడ్జెట్ సమావేశం

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ

పేద, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీ బడ్జెట్ సమావేశంలో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు పలు సూచనలు చేశారు. గత దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరణ చేస్తామన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ కి రానున్న బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించి, పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాబోయే ఏడాది కాలంలో రాష్ట్రంలో వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణం పనులు పూర్తవుతాయని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రులు ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాంటోరియంలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టియాన చొంగతా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com