31.8 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ప్లాన్ B అమలు చేస్తున్న అల్లు అరవింద్ ?

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయింది. దిల్ రాజ్ ని ఉద్దేశిస్తూ.. ఒక సినిమా కింద పడేస్తే.. మరో సినిమా నిన్ను పైకి లేపింది అన్నారు అరవింద్. ఆ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ అండ్ సక్రాంతికి వస్తున్నాం సినిమాలనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గేమ్ ఛేంజర్ కిందపడేసింది అని అనగానే మెగా ఫ్యాన్స్ అరవింద్ పై ఫైర్ అయ్యారు. అరవింద్ ని తెగ ట్రోల్ చేశారు. తండేల్ ప్రెస్ మీట్ లో ఓ సినిమా విలేఖరి అదే ప్రశ్న అరవింద్ ని అడిగితే.. నో కామెంట్స్ అని బదులిచ్చారు.

దాంతో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యా యి. చివరికి అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చారు. పొరపాటున అలా అన్నానని చెప్పుకొచ్చారు. దాంతో ఈ కథ సమాప్తమైంది. ఐతే.. ఇండస్ట్రీలో మాత్రం దీనికి కొనసాగింపుగా మరో పెద్ద కథే నడుస్తోంది. ఎవరు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా.. అల్లు వర్సెస్ మెగా అనే దానిపై వాదనలు, గుసగుసలు నడుస్తూనే ఉన్నాయి.

తండేల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన తండేల్ నాగ చైతన్య మార్కెట్ ని అమాంతం పెంచేసింది. తండేల్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కింగ్ నాగ్ చాలా ఎమోషనల్ అయ్యారు. సక్సెస్ మీట్ కి వచ్చి చాలా రోజులవుతుంది.. అంటూ భావోద్వేగంతో తన స్పీచ్ మొదలుపెట్టారు కింగ్ నాగ్.

నాగ్ స్పీచ్ లో బాగంగా అల్లు అండ్ అక్కినేని మనకు బాగా సెట్ అయిందండీ.. అని నాగ్ అన్నారు. ఆ కామెంట్ పై ఫిలిం సర్కిల్స్ లో పెద్ద చర్చే నడుస్తోంది. పైగా అక్కినేని నాగేశ్వరరావు చేసిన తెనాలి రామకృష్ణ పాత్రని త్వరలో చైతూతో చేస్తున్నాం అని దర్శకుడు చందూ మొండేటి ప్రకటించాడు. దాంతో అల్లు అండ్ అక్కినేని కాంపౌండ్ పూర్తిగా కలిసిపోయింది అనే టాక్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో అల్లు అరవింద్ అక్కినేని ఫ్యామిలీతో కలిసి భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మెగా కాంపౌండ్ లో చాలామంది హీరోలున్నారు. ఆ యంగ్ జనరేషన్ హీరోస్ ని వదిలేసి, అరవింద్ అక్కినేని ఫ్యామిలీతో ఎందుకు సినిమాలు చేస్తున్నారు.. ? అన్న టాక్ ఫిలింనగర్ లో స్ప్రెడ్ అవుతోంది.
గతంలోనే గీతాఆర్ట్స్ బ్యానర్ పై 100 పర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు ఆల్ రెడీ తెరకెక్కాయి. ఐతే.. తండేల్ సమయం వచ్చేసరికి సీన్ మారిపోయింది.
ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో అల్లు అరవింద్ జాగ్రత్త పడుతున్నాడని, అందులో భాగంగానే ప్లాన్ B అమలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో అక్కినేని ఫ్యామిలీతో వరుస సినిమాలు చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు. దాంట్లో భాగంగానే తండేల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని అనుకుంటున్నారు. ఇలా ఏం జరిగినా.. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ చెవులు కొరుక్కోవటం ఇండస్ట్రీలో కామనైపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com