32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ సెటైర్లు

కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో సెటైర్లు వేశారు. ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్‌ చేశారు. బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్‌ గాంధీకి కంగ్రాట్స్‌.. అంటూ ఎక్స్‌లో కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు గతంలో రాహుల్‌ గాంధీ గురించి ఆయన మాట్లాడిన వీడియోను కూడా అటాచ్‌ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌ ఇంకా పూర్తిగా రాకముందే.. ట్రెండ్‌ బీజేపీ వైపు మొగ్గు చూపగానే కేటీఆర్‌ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ చేశారు.

అయితే, పోస్ట్‌లో తాను ట్యాగ్‌ చేసిన వీడియో కూడా ఆసక్తికరంగానే ఉంది. గతంలో ఇండియా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్‌ మాట్లాడిన వీడియో అది. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్‌గాంధీయే అని ఆ వీడియోలో కేటీఆర్‌ సెటైర్లు వేశారు. రాహుల్‌ గాంధీకి బీజేపీని నిలువరించే సత్తా లేదని, ఆయనకు ఆ సత్తా ఉంటే.. ఉత్తర ప్రదేశ్‌కో, గుజరాత్‌కో, బీహార్‌కో వెళ్లి ఆ పార్టీతో కొట్లాడాలి గానీ, తెలంగాణకు వచ్చి బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే నేతలతోనే పోరాడతానంటారని, అందుకే దేశంలో మోదీకి ఉన్న అతిపెద్ద కార్యకర్త రాహుల్‌ గాంధీయే.. అని కేటీఆర్‌ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఢిల్లీ అసంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో చేసిన ఈ ఎక్స్‌ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com