దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్ చేసింది. అయితే ఇండియన్ ఆర్మీ అలెర్ట్‌గా ఉండటంతో ఈ కుట్ర భగ్నమైంది. భారత్‌లోకి చొరబడి అలజడి సృష్టించేందుకు ప్రయత్నించి ఉగ్రవాదుల ప్రయత్నించారు. కృష్ణ ఘాటీ సెక్టార్లో చొరబాటుకు ప్రయత్నించిన ఏడుగురిని మట్టు పెట్టింది ఆర్మీ. అయితే చొరబాటుకు ప్రయత్నించిన వారిలో ముగ్గురు పాక్ ఆర్మీకి చెందిన సైనికులు ఉన్నారు. ఈ కుట్రను దగ్గరుండి మరీ అమలు చేసేందుకు ప్రయత్నించింది పాక్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ అని గుర్తించింది ఇండియన్ ఆర్మీ.
ఈ చొరబాట్లు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి జరిగినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం జరుపుకుంది పాకిస్థాన్. అదే రోజు పీవోకేలో హమాస్, లష్కరే తొయిబా నేతలు భేటీ అయ్యారు. అదే సమయంలో ఇలా చొరబాట్లు జరిపి భారీ విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్‌పై దాడి చేసేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. చొరబాటుకు ప్రయత్నించిన వారిలో ముగ్గురు పాక్ అధికారులు కాగా.. మిగిలిన వారంతా అల్ బదర్ అనే ఉగ్రసంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.
అయితే ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ధ్రువీకరించలేదు. చొరబాటుకు ప్రయత్నించిన సమయంలో పాక్ ఆర్మీ వీరికి సపోర్ట్‌గా కాల్పులు జరిపిందని.. ఆ సమయంలోనే వారి మృతదేహాలను వెనక్కి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. LOC వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. కానీ పాక్ BAT మాత్రం ఉగ్రవాదులను దగ్గరుండి మరీ సరిహద్దును దాటిస్తోందని ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి.