35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

మోడీ విమర్శల దూకుడు వెనక….

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంటుందన్న వార్తలతో బీజేపి అప్రమత్తమైంది. పార్లమెంటు వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించడం అందులో భాగమేనా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్‌ అని విమర్శించిన మోడీ కాంగ్రెస్ పై నిన్న చేసిన విమర్శల దూకుడు అన్నింటికన్నా హైలైట్ గా నిలిచింది. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మోడీ కాంగ్రెస్ ను ఓ రేంజ్ లో తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగం జేబులో పెట్టుకు తిరిగేవారే దశాబ్దాలుగా ముస్లిం మహిళలు కష్టాలు పడేందుకు, బాధామయ జీవితాలను గడిపేందుకు దోహద పడ్డారని మండిపడ్డారు.అంతకుముందు రాహుల్‌ మాట్లాడుతూ మోడీ మేకిన్ ఇండియా నినాదం అట్టర్ ఫ్లాప్‌ అని విమర్శించారు.ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వికసిత్ భారత్ నినాదంతో అభివృద్ధి బాటలో దేశం ముందుకు సాగుతోందని 2047నాటికి దేశ స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోతాయని ఎవరూ ఊహించని విధంగా జీవన ప్రమాణాలు పెరగుతాయనిఅన్నారు. బీజేపి మూడు సార్లు కాదు.. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటుంది.అందులో అనుమానం లేదు.

అని కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు.బిజపి విదేశాంగ విధానం పైనా రాహుల్ విమర్శలు చేశారు. దానికి కూడా మోడీ స్పందిస్తూ విదేశాంగ విధానంపై కొందరు నేతలకు పరిపక్వత లేదని, అందుకే వారు జాతి ప్రయోజనాలను సైతం ఫణంగా పెట్టి మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు.

మీ ఏలుబడిలో దేశం 50 ఏళ్లు వెనక్కి

కాంగ్రెస్ 40 ఏళ్ల పాలనలో దేశం అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమైందని, కనీసం దశాబ్దం వెనక బడిపోయిందని మోడీ అన్నారు.2014లో బీజేపికి అధికారం వచ్చే ముందు వరకూ దేశంలో జరిగినదేమిటో అందరూ గమనించాలని మోడీ అన్నారు.ప్రపంచంతో పోటీ పడే విషయంలో మన దేశం 40,50 ఏళ్లు వెనకబడిపోయిందని అది తనను బాగా బాధకలిగించే అంశమనీ మోడీ అన్నారు.

ఆయుష్మాన్ భారత్ మహిమ

మొన్న మొన్నటి వరకూ కేన్సర్  అత్యంత భయానకమైన జబ్బు. ఆనీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తర్వాత ఎంతోమంది ఈ భయంకరమైన జబ్బు నుంచి బయటపడ్డారు.కేన్సర్ కేసుల జీవన కాల పరిమితి పెరిగింది. వారు పూర్తిగా నయమయిన సందర్భాలూ ఉన్నాయి. లాన్సెట్‌ జర్నల్‌ అధ్యయనంలోనే ఇది బయటపడింది. మేం అమలు చేసిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్  ఫలితం ఇదంతా అని మోడీ తెలిపారు.

 ఆయుష్మాన్‌ భారత్‌  వరదాయిని

కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచేందుకు ఉద్దేశించిన సంజీవని లాంటిదని మోడీఅన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిన ఈ విధానాన్ని కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అమలు చేయకుండా పేద ప్రజలను వైద్యానికి దూరం చేశాయని అన్నారు.ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన కొన్ని మందుల ధరలను ఈ బడ్జెట్‌ లో తగ్గించిన ఘనత కూడా తమేదనని మోడీ అన్నారు.

మాది సంతుష్టీకరణ విధానం

పార్టీల్లో కొన్నిటి విధానం తుష్టీకరణమని, అంటే ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోడమని మాది మాత్రం సంతుష్టీకరణ విధానమని మోడీ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను  సంతృప్తి పరచేలా మా విధానం ఉంది.. దేశంలో పథకాలు వందశాతం అమలు జరిగినప్పుడే ఈ తృప్తి భావన ప్రజలకు వస్తుందని మోడీ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com