గతేడాది మరణించిన తన సోదరుడి ప్రథమ వర్థంతి కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. భట్టి విక్రమార్క సోదరులు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు యేడాది క్రితం మరణించారు. వైరాలో జరిగిన ఆయన ప్రథమ వర్థంతి కార్యక్రమానికి భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ కార్యక్రమం కోసం వైరా చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో పాటు.. కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు సమాధిని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడి సమాధిపై పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం వెంట వైరా శాసనసభ్యులు రాందాసు నాయక్, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.