30.6 C
Hyderabad
Saturday, August 1, 2026

Live Video

spot_img

దుమ్మురేపిన అమ్మాయిలు.. కప్పు మనదే

అమ్మాయిలు కాదు.. చిచ్చర పిడుగులు. తన దూకుడైన ఆటతో మరోసారి ఇండియాను తలెత్తుకునేలా చేశారు. దీంతో మరోసారి భారత్‌ను విశ్వవిజేతగా నిలిచారు.. U-19 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నారు. అండర్ 19 మహిళ టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు సఫారీలు నిలవలేకపోయారు.

నిజానికి ఈ టోర్నీ మొత్తం అదరగొట్టారు అమ్మాయిలు ఇక అదే జోరును ఫైనల్స్‌లోనూ కొనసాగించారు. అసలేమాత్రం తగ్గేదలే అన్నట్లు పర్ఫార్మ్ చేశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను 82 రన్స్‌కే కట్టడి చేశారు. ఒత్తిడి తట్టుకోలేక మరోసారి సఫారీ సేన చిత్తయింది. ఇక స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్.. 12ఓవర్లలో గేమ్ ఫినిష్ చేసి జగజ్జేతగా నిలిచింది.

భారత్ బౌలర్ల ముందు ఏ మాత్రం నిలవలేకపోయారు సౌతాఫ్రికా బ్యాటర్లు. నలుగురిని డకౌట్‌గా పెవిలియన్‌కు పపంగా.. ముగ్గురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరో నలుగురు ప్లేయర్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయడంతో స్కోర్‌ 82కు చేరుకుంది.

ఇక ఈ స్వల్ప స్కోర్‌ను చేధించేందుకు రంగంలోకి దిగిన బ్యాటర్లకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కమలిని కేవలం 8 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఆ తర్వాత త్రిష, సానిక ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా చెలరేగిపోయారు. మరో వికెట్ కోల్పోకుండా స్కోర్‌ను చేధించారు. కప్పు గెలిచారు.

భారత్ పొట్టి కప్పు గెలవడంలో.. భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష పాత్ర కీలకం. టోర్నీ మొత్తం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించింది త్రిష. ఇక ఫైనల్‌లో ఏకంగా 3 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను దెబ్బకొట్టింది. బ్యాటింగ్‌లో 44పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డ్ దక్కించుకుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com