28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

కేంద్ర బడ్జెట్‌లో అన్నదాతలకు వరాలు

– కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి పెంపు
– పది రంగాలపై ప్రత్యేక దృష్టి
– మఖనా ఉత్పత్తి పెంచేలా శిక్షణ
– ధన్‌ ధాన్య పథకం కింద పప్పు ధాన్యాలు కొనుగోలు

లోక్‌సభలో ఈ యేడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నదాతలకు శుభవార్తలు చెప్పారు. వ్యవసాయంపై వరాల వర్షం కురిపించారు. పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రధానంగా ఇప్పుడు అమలు చేస్తోన్న కిసాన్‌ క్రెడిట్‌కార్డుల రుణ పరిమితిని భారీగాపెంచారు. అలాగే, పది రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా రైతులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ధన్‌ ధాన్య పథకం కింద పప్పు ధాన్యాలు కొనుగోలు చేయిస్తామని నిర్మల తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు.

మొత్తానికి వికసిత్ భారత్ లక్ష్యంగానే ఈ యేడాది బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలకు 70 శాతం ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా 10 రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు నిర్మల తెలిపారు. ఆ పది రంగాలకు సంబంధించి పేదలు, యువకులు, అన్నదాతలు, మహిళలు ఉన్నట్లు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు మంత్రి. అలాగే పప్పుధాన్యాలలో స్వయం సమృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితిని పెంచుతున్నట్లు వెల్లడించారు. కేసీసీ ద్వారా ఇచ్చే అప్పులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామన్నారు. బిహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు.. మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా రైతులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. దేశంలోని 100 జిల్లాలను ధన్ ధాన్య యోజనతో అనుసంధానిస్తామని చెప్పారు. పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల సౌకర్యాలు, రుణాలు 1.7 కోట్ల మంది రైతులకు సహాయపడతాయని మంత్రి నిర్మల తెలిపారు. పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళికలో భాగంగా కందులు, పెసలు, మినుములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నామని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. ధన్ ధాన్య పథకం కింద.. నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ రైతుల నుండి పప్పుధాన్యాలను కొనుగోలు చేస్తామన్నారు. అలాగే మత్స్యకారులకు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్‌ మిషన్‌ చేపడట్టనున్నట్లు నిర్మల చెప్పారు. సాంప్రదాయ పత్తి పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పత్తి ఉత్పత్తిపై 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com