23 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

ద్రవ్యోల్బణం సవాళ్ళను అధిగమించడానికి ఈ బడ్జెట్‌ ఊతం – యనమల

కేంద్ర బడ్జెట్‌లో తొలిసారి మధ్యతరగతి సమస్యల గురించి బడ్జెట్‌ కేటాయింపులు ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నీటికి ఎదురీదేలా ఉన్న పరిస్ధితుల్లో కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్న యనమల ఆర్థిక అసమానతలు, పేదరికం నిర్మూలన, స్ధిరమైన ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉపాధి కల్పంచడం వంటి అనేక ప్రధాన సవాళ్ళను పరిష్కరించే ప్రయత్నం ఈ బడ్జెట్‌ ద్వారా చెయ్యడం స్వాగతించాల్సిన విషయమన్నారు. శనివారం నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్యులు, రైతుల అంచనాలు కొంతమేరకు నెరవేరాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, సామాన్యుల ఆదాయ వృద్ధికి దోహదపడే తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు మన రాష్ట్రానికి భారీ ఆర్థిక ప్రోత్సహం లభించేలా బడ్జెట్‌ ఉందన్నారు యనమల. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు ఇది ఎంతో ఉపయోగపడుందన్న ఆశాభావం యనమల వ్యక్తం చేశారు. ఆర్థిక ఏకీకరణ, ద్రవ్యోల్బణం సవాళ్ళను అధిగమించడానికి ఈ బడ్జెట్‌ ఒక ప్రారంభం వంటిదన్నారు. రుణభారాన్ని నిలకడగా ఉంచి ఇతరత్రా భారీ రుణాలను అరికట్టేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమైన అంశాలను స్వాగతిస్తున్నామని యనమల రామకృష్ణుడు అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com