లోక్‌సభలో శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ యేడాది బడ్జెట్లో కీలక అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆర్థికమంత్రి. పలు కీలక రంగాల్లో ఏఐ సేవలను వినియోగించుకుంటామన్నారు. ఏఐ ఆధారిత సర్వీసులను అందిస్తామన్నారు. ముఖ్యంగా రైతులకు సాయం, ఆరోగ్యబీమా, విద్యారంగాల్లో కృత్రిమ మేథను వినియోగించుకుంటామన్నారు. వివిధ రంగాలలకు సంబంధించి.. అనేక ప్రోత్సాహకాలను నిర్మల ప్రకటించారు. ఈ యేడాది బడ్జెట్లో ఆయా రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం వంటి అంశాలున్నాయి. ఈ బడ్జెట్లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.
– KCC ద్వారా లోన్ల పెంపు :
కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రైతులకు అందించే లోన్ల పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కీలకమైన నిర్ణయంగా భావించబడుతోంది.
– స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులు :
స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులను రూ. 30,000తో అందించనున్నట్లు ప్రకటించారు. ఇది చిన్న వ్యాపారాలకు పెద్ద ఊతాన్ని ఇవ్వనుంది.
– బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం :
బొమ్మల తయారీ రంగంలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.
– ఐఐటీ పాట్నా విస్తరణ :
భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ పాట్నాను విస్తరించడానికి నిధులు కేటాయించబడినట్లు ప్రకటించారు.
– రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు రుణాలు :
రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన వ్యయాల కోసం రూ. 1.5 లక్షల కోట్ల రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు.
– 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు :
50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు, ఇది దేశంలోని వివిధ రంగాలకు కీలకంగా ఉంటుంది.
– గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా :
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా మరియు గుర్తింపు కార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా వారికి మరింత మద్దతు లభించనుంది.
– పీఎం ధన్‌ధాన్య యోజన :
MSME రంగంలోని 7.5 కోట్ల మందికి సాయం అందించడానికి పీఎం ధన్‌ధాన్య యోజనను అమలు చేయనున్నారు.
– ప్రయోగాత్మకంగా పీఎం ‘ధన్‌ధాన్య’ యోజన :
పీఎం ధన్‌ధాన్య యోజనను మొదటగా 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు.
– మఖనా ఉత్పత్తి పెంపు :
బిహార్‌లోని మఖనా రైతులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, ఉత్పత్తి పెంచేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.
– విద్యారంగంలో ఏఐ వినియోగం :
విద్యారంగంలో ఆధునిక టెక్నాలజీలను, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించడం ప్రారంభించనున్నారు.
– ఐఐటీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు :
వచ్చే 10 సంవత్సరాలలో ఐఐటీ విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
– అంగన్వాడీలకు కొత్త హంగులు :
అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి వృద్ధి కోసం నిధులు కేటాయించనున్నారు.