26.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

మన ట్రాక్ రికార్డు భేష్‌… ఆర్థిక సర్వే

  • ఈ ఏడాది ఆర్థిక వృద్ధి అంచనా రేటు 6.6 శాతం
  • ఇప్పటికీ వ్యవసాయమే బలమైన ఆర్థిక రంగం
  • సేవల రంగంలో ఎగుమతులు భేష్‌
  • నిరుద్యోగాన్ని, ధరల పెరుగుదలని తగ్గించాం
  • ఏఐ వినియోగంలో వివేచన అవసరం…
  • మితిమీరిన పనివేళలు మంచివి కావు
  • పర్యవసానాలు ఆర్థిక పురోగతిపై ఉండరాదు

ఓ పద్ధతి పాడు లేని పనివేళలు, సోషల్‌ మీడియాకు ఎక్కువగా సమయం కేటాయించడ, ఒంటికి తగినంత వ్యాయామం లేకపోవడం, మితిమీరిన పని ఒత్తిడి ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని 2024-2025 ఎకనామిక్ సర్వే అభిప్రాయపడింది. ఈ అన్ని రుగ్మతలు ఆర్థిక పురోగతిపై ప్రభావం చూపుతాయని అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో6.6 శాతం పురోగతిని సాధించగలమని ఈ సర్వే అంచనా వేసింది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా పురోగమన చర్యలకు అభివృద్ధికి గణనీయమైన ఆస్కారం ఉందని లెక్కగట్టింది.60 గంటల పనిదినాలు సిబ్బంది, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం కలిగిస్తాయని ఎకనామిక్ సర్వేఅభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికీ వ్యవసాయ రంగమే మన ప్రధాన అభివృద్ది సాధనంగా నిలదొక్కుకుందని, కోవిడ్‌పాండమిక్ తర్వాత పారిశ్రామిక రంగం కూడా ఆ విపత్తు నుంచి కోలుకుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ ను సమాజ విలువలకు లోబడి వినియోగించాలని, ఏఐ రంగంలో అన్వేషణలకు జవాబుదారీ తనం, పారదర్శకత ఉండాలని వ్యాఖ్యానించింది. ఆర్ఠిఫీషియల్‌ రంగం విస్తరణతో అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి వారికి ఉద్యోగ భద్రత కరువయ్యే ప్రమాదముందని, దీనిని ఆచితూచి వాడాల్సిన అవసరముందని ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ అన్నారు.

గత ఏడేళ్లుగా నిరుద్యోగం బాగా తగ్గుముఖం పట్టి 3.2 శాతానికి చేరుకుందని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల నిరుద్యోగ భూతాన్ని అంచెలంచెలుగా పారదోలగలుగుతున్నామని అన్నారు. నిరుద్యోగం రూపు మాపడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఇటీవల ప్రారంభించిన పీఎం ఇంటర్న్ షిప్ స్కీమే అందుకు ఉదాహరణ అని ప్రీబడ్జెట్‌ సర్వేలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటూస్వయం ఉపాధి రంగంలో అవకాశాలు పెంచుతున్నామంది.

వాతావరణంలో మార్పులు, డిమాండ్‌ సప్లయ్ చైన్ ను దెబ్బతీస్తున్నా నిత్యావసరాల ధరలు మరీ పెరగకుండా అదుపులో ఉంచగలగుతున్నామని ఆర్థిక మంత్రి అన్నారు. అకాల వర్షాలు, వరదలు, వడగాడ్పులు లాంటి అననుకూల వాతావరణం వల్ల కూరగాయలు, పప్పు ధాన్యాల దిగుబడి తగ్గిందని ఆర్థిక సర్వే తెలిపింది. సర్వీస్ సెక్టర్ లో ఎగుమతులలో పురోగతి కనిపిస్తోందని ఈ ఏడాది తొలి 9 నెలల్లో 11.6 శాతం పెరుగుదల ఉండోచ్చని ఆర్థిక సర్వే లెక్క గట్టింది. మొత్తం మీద అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రతిభకనపరుస్తున్నామని ప్రీ బడ్జెట్ సర్వే అంచనాలు తెలిపాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com