ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో హుండీ లెక్కింపు చేపట్టారు. శ్రీశైల భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వార్ల పుణ్యక్షేత్రంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించారు. శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,59,68,400 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో సమర్పించడం జరిగింది. ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు ఇవి. ఈ నగదుతో పాటు 64 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 3కేజీల 170 గ్రాముల వెండి భక్తులు హుండీ ద్వారా సమర్పించారు.అదేవిధంగా 590 యుఎస్ఏ డాలర్లు, 100 చైనా యువాన్స్, 5 సౌదీ అరేబియా రియాల్స్, 2 కువైట్ దినార్లు, 10 కెనడా డాలర్లు, 1090 యూఏఈ దిర్హమ్లు, 14 సింగపూర్ డాలర్లు, ఒక ఖతార్ రియాల్, 5 యూరోలు, 23 మలేషియా రింగిట్లు, 45 యూకే ఫౌండ్లు, 240 ఆస్ట్రేలియా డాలర్లు, 30 రష్యా రూబెల్స్ వంటి విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో కనుక్కున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement with us -