29.7 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

చిత్తూరు అటవీ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెరడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీభూములు ఆక్రమించిందనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదికలో పేర్కొనాలని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. అటవీ భూములు ఎవరు ఆక్రమించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సత్వరమే ప్రాథమిక నివేదక ఇవ్వాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ అధికారిని డిప్యూటీ సీయం ఆదేశించారు.

అటవీ భూములను ఆక్రమించుకోలేదు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూనే జిల్లాలో తన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గతంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం సర్వే చేసి క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని వెల్లడించారు. హైకోర్టు సైతం ఫిర్యాదుదారుడి పిటీషన్‌న్ని డిస్మిస్‌ చేసిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com