36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఇంటింటి సమగ్ర సర్వే సక్సెస్

రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక

ఫిబ్రవరి 2న కేబినేట్ సబ్ కమిటీకి తుది నివేదిక

దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ

అధికారులు, ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణన పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.

బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్ కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని అన్నారు.

సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీ కి తుది నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నవంబర్ 6వ తేదీన రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే 2024) మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం అధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వే మహా యజ్ఞంలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు పాలుపంచుకున్నారు.

రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాలుపంచుకోలేదదని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.

రికార్డు వేగంతో కుల గణన

అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 4వ తేదీన సీఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 16వ తేదీన ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది.

సెప్టెంబర్ 12వ తేదీన ఇంటింటి సర్వే కుల గణన చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటయిన సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమైంది.

అక్టోబర్ 9వ తేదీన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన పేరిట సర్వే చేపట్టాలని, ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు.

అక్టోబర్ 10వ తేదీన ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధి విధానాలతో జీవో నెం.18 జారీ చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com