గంటకు పైగా నిలిచిపోయిన మెట్రో సేవలు
అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో బుధవారం ఉదయం కొద్దిసేపు హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు హైటెక్ సిటీ నుంచి అమీర్పేట వైపు ఒక్క మెట్రో రైలు సర్వీసు కూడా నడవకపోవడంతో కొంత సేపు ప్రయాణికులుకు ఏమీ అర్ధం కాలేదు. గంటపాటు మెట్రో సర్వీసులు లేకపోవడంతో ఆరూట్లో ప్రయాణికులు అసౌకర్యానికి గుర్యారు. ఉదయం ఆ సమయంలో మాదపూర్ వెళ్ళే మెట్రో రైళ్ళు అత్యంత రద్దీగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో రైళ్లన్ని కిటకిటలాడిపోతాయి. సరిగ్గా ఆఫీసులకు వెళ్ళే సమయంలో మెట్రో రైల్ సర్వీలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక కారణాల వల్ల జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్లో ఒక రైలు ఆగిపోవడంతో రాయదుర్గం నుంచి అమీర్పేట వెళ్ళే మెట్రో రైళ్ళ రాకపోకలన్నీ గంట పాటు ఆగిపోయాయి. గంట తరువాత అధికారులు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో ఆగిపోయిన సాంకేతిక సమస్యతో ఆగిపోయిన రైలును సరిచేసి రాకపోకలను పునరుద్ధరించారు. అయితే ప్రత్యేకంగా మాదాపూర్ మార్గంలో మెట్రో రైళ్ళు తరచు సాంకేతక సమస్యలు ఎదర్కొన్ని ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అదీ కార్యాలయాలుకు వెళ్ళే సమయంలోనే ఇటువంటి అంతరాయలు ఏర్పడుతుండటంతో అటువైపుగా వెళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.