36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

శివరాత్రి సందర్భంగా 24 గంటల “గాన స్వరాభిషేకం”

జగిత్యాల పట్టణంలోని వాణి నగర్‌లో ఉన్న జవ్వాజి పుల్లయ్య గారి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ధర్మశాల లో ఈ నెల 26వ తేదీన డాక్టర్‌ నక్క రాజు నిర్వహించనున్న 24 గంటల గాన స్వరాభిషేకం వాల్ పోస్టర్ ను ఆధ్యాత్మిక ప్రముఖులు ఆవిష్కరించారు. గత 13 వసంతాలుగా నక్క రాజు ఆధ్యాత్మిక గాన స్వరాభిషేకం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 7వ సారి 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం కార్యక్రమాన్ని వాణి నగర్ – జగిత్యాలలోని జవ్వాజి పుల్లయ్య గారి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ధర్మశాలలో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పర్యవేక్షకులు జవ్వాజి సందీప్ తెలిపారు. భగవత్ బంధువులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ 24 గంటల కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు మాట్లాడుతూ నక్క రాజు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ఆయన పొందిన అవార్డులు, డాక్టరేట్ పట్టాలను ప్రస్తావిస్తూ అభినందించారు. మహా శివరాత్రి నాడు ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి 27 గురువారం ఉదయం 8 గంటల వరకు ఈ “మహా సంకల్ప దృఢ నిశ్చల శివ నామ గాన స్వరాభిషేకం” జరుగు తుందని నక్క రాజు తెలిపారు. భగవత్ బంధువులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, కళాకారులు, గాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఆయన కోరారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com