38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

హస్తినలో బీజేపీ ముందు 10 సవాళ్లు.. అయ్యే పనేనా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే సీఎం ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా నుంచి భారత్‌కు చేరుకోవడంతో ఇక పేరు ఫైనల్ కాబోతుంది. అయితే సీఎం ఎవరైనా చాలా పెద్ద సవాళ్లే వారికి వెల్‌కమ్ చెప్పబోతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో చాలా పెద్ద హామీలిచ్చింది బీజేపీ. మరి బీజేపీ వాటన్నింటిని నెరవేర్చుతుందా? లేదా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

బీజేపీ ముందున్న సవాళ్లేంటి?
1. యమునా నదిని క్లీన్ చేయడం.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీ రోల్ ప్లే చేసింది యమునా నది. ఈ నదిని శుభ్రం చేస్తామని అన్ని పార్టీలు హామీలిచ్చాయి. యమునను శుద్ధి చేసి.. మూడేళ్లలో రివర్‌ఫ్రంట్‌ను నిర్మించాల్సి ఉంటుంది.
2. డంపింగ్ యార్డ్‌ల తొలగింపు
రాబోయే మూడేళ్లలో చాలా చోట్ల అనధికారింగా వెలిసిన డంపింగ్ యార్డ్‌లను తొలగించాల్సి ఉంటుంది.
3. ఉచిత సిలిండర్లు
ప్రతి పేద మహిళకు రూ.500కే సిలిండర్ అందించాల్సి ఉంటుంది. ఇక హోలీ, దీపావళి సందర్భంగా సిలిండర్‌ను ఉచితంగా అందించాల్సి ఉంటుంది.
4. ప్రతి పేద మహిళకు నెలకు రూ.2,500 అందించాల్సి ఉంటుంది.
5. గర్భిణీలకు రూ.21,000 ఆర్థిక సాయం, ఆరు న్యూట్రిషన్ కిట్స్ అందించడం. 6. ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సహాయం అందించడం. మొదటి కేబినెట్‌లో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
7. 60 ఏళ్లకు పైబడిన వారికి రూ.2,500 పెన్షన్, 70 ఏళ్లకు పైబడిన వారికి రూ.3,000పెన్షన్.
8. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీరు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
9. ఢిల్లీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం. దీనికోసం 20 వేల కోట్లతో 13 వేల కొత్త బస్సులను తీసుకురావడం.
10. గిగ్ వర్కర్స్, ఆటో, టాక్సి డ్రైవర్స్, ఈ-రిక్షా డ్రైవర్స్‌కు 10 లక్షల ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెస్స్ 5 లక్షలు అందించడం.

నిజానికి గత ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి హామీలనే ఇచ్చారు. కానీ పూర్తిగా నెరవేర్చలేకపోయారు. మరి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చేసి చూపిస్తుందా? లేదా? చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com