మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో రహస్యంగా వీడియోలు తీశారంటూ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న రాత్రి నుంచి కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థినుల ప్రైవేటు వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు దొరకాలేదని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో రహస్యంగా వీడియోలు తీశారంటూ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థినుల ప్రైవేటు వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు దొరకాలేదని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.