సమస్యల చిట్టాను కూటమి ప్రభుత్వం ఉంచిన అర్చక స్వాములు.
నంద్యాల మూలమట్టం శివాలయంలో ఏపీ అర్చక సమాఖ్య రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లోని అర్చక స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణలో భాగంగా ఇప్పటికే కొన్నిఈ కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అర్చక స్వాములకు సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని ఈ సమావేశంలో పాల్గొన్న అర్చక సమాఖ్య ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సుమారు 15 అంశాలతో కూడిన సమస్యల చిట్టాను ప్రభుత్వం ముందు ఉంచింది రాష్ట్ర అర్చక సమాఖ్య. దేవాలయాల్లోని అర్చకులకు పీఆర్సీ వేతనాలు అమలు చేయాలని.. వంశపారంపర్య అర్చకులకు జీవో నెంబర్ 439 ప్రకారం రెమ్యూనరేషన్ స్కీమ్ అమల్లోకి తేవాలని.. వేతన స్కేల్ ఇవ్వలేని అర్చకులకు కనీస గౌరవ భృతిగా రూ. 15 వేలివ్వాలని అర్చక సమాఖ్య కోరింది. వీటితో పాటు అర్చకుల ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను సమాఖ్య వేదికగా ప్రభుత్వ దృష్టికి తెచ్చారు అర్చక స్వాము.
అర్చక స్వాముల ప్రధాన సమస్యలు..
01. సెక్షన్-43 ప్రకారం సర్వీస్ రిజిస్టరులో వంశపారంపర్య అర్చకుల పేర్లను నమోదు చేయాలి.. అర్చక సర్వీసు భూమి వివరాలను విధిగా రాయాలి.
02. అర్చక ఈనాంలు అనుభవిస్తున్న అర్చకుల పేర్లను అడంగళ్లలో, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలి.
03. రూ. 2 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యం స్కీం విధిగా అమలు చేయాలి.
04. అర్చక స్వాములకు హెల్త్ కార్డులివ్వాలి.
05. అర్చక సంక్షేమ నిధికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. దీని నిమిత్తం కార్పస్ ఫండ్ కోసం సుప్రీం కోర్టు సూచనలను అమలు చేయాలి.
06. శాశ్వత ప్రాతిపదికన ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలి.
07. ఐదు లక్షల రూపాయల్లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ వంశపారంపర్య అర్చక స్వాములకు.. ధర్మకర్తలకు అప్పజెప్పాలి.