డొనాల్డ్ ట్రంప్ తన పనిని ప్రారంభించాడు. ప్రమాణస్వీకారానికి ముందే తాను ఏం చేయాలనుకుంటున్నాడో క్లియర్ కట్‌గా చెప్పేశాడు. సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దాడి ఆగిపోతుంది.. సరికొత్త చరిత్ర ప్రారంభించబోతున్నాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ప్రమాణస్వీకారానికి ముందు విక్టరీ ర్యాలీ నిర్వహించిన ట్రంప్.. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలక పాయింట్స్..
* చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా అక్రమవలస దారులను బయటకు పంపిస్తా.
* అమెరికా సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తా.
* అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తా.
* మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడకుండా అడ్డుకుంటా
* జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకు సంబంధించిన ఫైల్స్‌ను బయటపెడతా.
* ప్రభుత్వంలో పారదర్శకతను పెంచుతా
* మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకంటాను.
* జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను అమలు కాకుండా అడ్డుకుంటా.
* టిక్ టాక్ సేవలను పునరుద్దరిస్తా. అయితే కంపెనీలో సగం వాటా అమెరికా పెట్టుబదిదారుల చేతిలో ఉండాలి. ఇది 90 రోజుల్లో జరగాలి.
* మిడిల్ ఈస్ట్‌లో శాంతిని మళ్లీ పెరిగేలా చేస్తా. ట్రంప్ వ్యాఖ్యలు పెద్ద దమారాన్నే లేపుతున్నాయి.. రానున్న రోజుల్లో ఎవరెవరు ెలా స్పందిస్తారో చూడాలి.