తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాసేపటిక్రితం ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ముగ్గరు చోప్పున సీనియర్ నేతల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు పరిశీలకుల జాబితాలో చోటు కల్పించింది. జార్ఖండ్‌లో శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడగానే అక్కడి పరిణామాలను భట్టి విక్రమార్క సమన్వయం చేయనున్నారు. భట్టి విక్రమార్క జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.