Ssmb29.. ఇపుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఈ మూవీకోసం మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. లాంగ్ హెయిర్, గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ ఆర్ రెడీ మొదలైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత పార్ట్ ను షూట్ చేశారు. మిగతా లొకేషన్స్ ను కూడా జక్కన్న ఇప్పటికే ఫిక్స్ చేశాడు. మహేష్ బాబు కెరీర్ లోనే ఇదో అరుదైన మూవీగా నిలవ బోతుందని మూవీ టీమ్ చెబుతోంది. మహేష్, జక్కన్న కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ గురించి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పారు. ఈ మధ్యకాలం ఇలాంటి జోనర్ లో సినిమా రాలేదని చెప్పారు. ఈ మూవీ సరికొత్త ఎడ్వైంచర్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందని అన్నారు. ఐతే.. కథ మాత్రం కాంటెంపరరీగానే ఉంటుందని అసలు విషయం చెప్పేశారు.
2015లో బాహుబలి ది బిగినింగ్ వచ్చింది. ఆ తర్వాత 2017లో బాహుబలి ది కన్ క్లూజన్ రిలీజైంది. 2021లో త్రిబుల్ ఆర్ వచ్చింది. ఈ రెండు కథలూ పీరియడ్ డ్రామాలే. అంటే.. 10 సంవత్సరాల తర్వాత రాజమౌళి కంటెంపరరీ కథను డైరెక్ట్ చేస్తున్నాడు. అది కూడా స్టైలిష్ యాక్షన్ ఎడ్వైంచర్. గత సినిమాలతో పోలిస్తే.. ఇది పూర్తి భిన్నంగా ఉండబోతుంద
ని అర్థమైపోతుంది.
రెండు భాగాలుగా రాబోతున్న ఈమూవీలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ కోసం ప్రియాంక 50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని వార్తలొచ్చాయి. చివరికి 30 కోట్లకి ఒప్పుకుందని కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది. అదే నిజమైతే.. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా ప్రియాంక రికార్డ్ సృష్టిస్తుంది. మహేష్ బాబు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకునే ఈ కథను రాశారట విజయేంద్రప్రసాద్. ఐతే.. షూటింగ్ ను పకడ్బందీగా ప్లాన్ చేశాడు రాజమౌళి.
మూవీకి సంబంధించిన ఎలాంటి న్యూస్ అధికారకంగా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. బాహుబలి, త్రిబుల్ ఆర్.. కథకు సంబంధించిన లైన్ ను షూటింగ్ కి ముందే లీక్ చేశాడు జక్కన్న. కానీ ఈ మూవీ విషయంలో మాత్రం సీక్రెసీ మెయింటేన్ చేస్తున్నాడు.