33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

సుఖ్ బీర్ సింగ్ పై దాడి వెనుక మిలిటెంట్ల హస్తం?

– నిందితుడు నారాయణ్ సింగ్ మాజీ మిలిటెంటా?

అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో  సుఖబీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ అనుకూల సంస్థల హస్త ముందని ప్రాధమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. నిందితుడు నారాయణ్ సింగ్ చౌరా ఇప్పటికే అనేక కేసుల్లో దోషి అని ఖలిస్తాన్ అనుకూల సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన వాడని తెలుస్తోంది. అతగాడు పంజాబ్ గురు దాస్ పూర్ జిల్లాలోని చౌరా అనే గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది. 1954లో చరణ్ సింగ్, గురు నామ్ కౌర్ అనే దంపతులకు జన్మించాడు. 68 ఏళ్ళ చౌరా 2004లో బరియల్ జైల్ బ్రేక్ కేసులో నలుగురు నిందితుల్లో ఒకడు. జైలునుంచి 104అడుగుల పొడవైన సొరంగ మార్గం తవ్వి ఆ నలుగురు జైలునుంచి తప్పించుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ నలుగురు బబ్బర్ ఖల్సా చీఫ్ జగ్దర్ సింగ్ కాగా, నిందితుడు పరమ్ జిత్ సింగ్ భియోరా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ ను హత్య చేసిన కేసులో నిందితుడు. ఇక మరో నిందితుడు జగ్దర్ సింగ్ తారా దేవీసింగ్ మర్డర్ కేసులో అరెస్టయి జైలు కు వచ్చిన వాడు. ఇక ప్రస్తుతం సుఖబీర్ సింగ్ పై దాడికి పాల్పడిన నారాయణ్ సింగ్ చౌరా నాల్గవ వాడు . నారాయణ్ సింగ్ చౌరా 2013లో నిషేధిత కార్యకలాపాల చట్టం కింద అరెస్టయి ఐదేళ్లు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చాడు. జైలులో ఉన్న సమయంలోనే ఈ నిందితులతో పరిచయాలేర్పడి జైలుకు సొరంగం తవ్వి వారితో కలసి పారిపోయాడు.

ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా..

శిరోమణి అకాలీదళ్ కు చెందిన సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్వర్ణదేవాలయం దగ్గర ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా ఈ దాడి జరిగింది. సేవాదార్ డ్యూటీలో ఉన్న సుఖబీర్ సింగ్ పై కాల్పులు జరిపేందుకు నిందితుడు తెగబడ్డాడు. ఇంతలో సమీపంలో ఉన్నవారు చూసి నిందితుడిని పట్టుకోవడంతో సుఖ్ బీర్ సింగ్ కు ఎలాంటి హానీ జరుగలేదు. 2015లో డేరా సచ్చా సౌదా అనే సంస్థకు చెందిన అధిపతి గుర్మీత్ రాం రహీమ్ ని స్వర్ణ దేవాలయంలోకి అనుమతించి సిక్కుల అతిపవిత్రమైన గురు గ్రంథ సాహిబ్ ను అవమానించి ఆరోపణల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుఖ్ బీర్ సింగ్ నడవలేని స్థితిలో వీల్ ఛైర్ లోనే కూర్చుని మెడలో తాను తప్పులు చేసిన కారణాలు రాసిన పలక వేసుకుని, ఒక చేత్తో క్రుపాణం పట్టుకుని కూర్చున్నారు. అంతేకాదు గురుద్వారాలో భోజనం ప్లేట్లు కడగడం, మరుగు దొడ్లు శుభ్రం చేయడం లాంటి శిక్షలు కూడా ఆయన , ఆయనతో పాటు మరో నలుగురు అనుభవిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com