ములుగు కేంద్రంగా బుధవారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి సమీపంలోనే ఉండే ఖమ్మం జిల్లాలో ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఖమ్మం పట్టణంతో పాటు జిల్లాలోని కామేపల్లి, కారేపల్లి మండలాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా ఇళ్లల్లో వైబ్రేషన్ రావడంతో జనం బయటికి పరుగులు తీశారు. కామేపల్లిలోని ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో భూకంపం తీవ్రత స్పష్టంగా కనిపించింది.
ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా మూడు సెకనుల పాటు భూకంపం సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. సీసీ కెమెరాల్లో కూడా పలు చోట్ల ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇక, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో సుమారు ఆరు సెకనుల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు.