భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సెక్రటేరియట్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట్ రావు, పలువురు అదనపు కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.