23.8 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

యు.ఎస్‌లో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా ‘గేమ్ చేంజర్’ మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమా చేయ‌ని అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నుంది. డిసెంబ‌ర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జ‌ర‌గ‌నుంది. క‌ర్టిస్ క‌ల్‌వెల్ సెంట‌ర్‌, 4999 నామ‌న్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ ముంద‌స్తువేడుకి వేదిక కానుండ‌టం విశేషం. చిత్ర యూనిట్‌తో పాటు ప్ర‌ముఖులంద‌రూ ఈ వేడుక‌కి హాజ‌రుకాబోతున్నారు.

రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com