24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

మహా సీయంగా ఫడ్నవీస్… నేడు అధికారిక ప్రకటన

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ పేరుని భారతీయ జనతాపార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. గురువారం మహాయుతి భాగస్వామ్య పక్ష నేతలందరూ ఢిల్లీ చేరుకున హోంమత్రి అమిత్ షాని కలిశారు. ఈ సదర్భంగా ముఖ్యమంత్రిగా బీజేపీ తరపున దేవేంద్ర ఫడ్నవీస్ అయితే తమకెవరికీ అభ్యంతరం లేదని శివసేన, ఎన్సీపీలు హోంమత్రికి స్పష్టం చేశాయి. తాజా మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సైతం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రెండు రోజుల క్రితమే వారిద్దిరికీ ఫోన్లో తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్లను ఢిల్లీ పిలిపించుకుని ముఖాముఖీ మాట్లాడారు అమిత్ షా. ఈ భేటీలో ఫడ్నవీస్ సీయం అభ్యర్ధిత్వంపై ఏకాభిప్రయం వ్యక్తమైనట్లు సమాచారం. శుక్రవారం బీజేపీ అధిష్టానం నుంచి అధికారికంగా ఫడ్నవీస్ పేరును సీయంగా ఎంపిక చేస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే శివసేన నుంచి ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com