నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి నాలుగు రోజుల ముందుగానే అక్కినేని ఇంటి పెళ్లి సందడి షురూ అయ్యింది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల హల్దీ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌లో రెండు కుటుంబాల సభ్యులతోపాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం.
నాగచైతన్య, శోభితా హల్దీ వేడుకల తాలుకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో చైతూ, శోభిత కనిపించారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభితా పెళ్లి జరుగనుంది.
అదే రోజు నాగచైతన్యతో పాటు అఖిల్ – జైనాబ్ వివాహం కూడా జరగనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పుకార్లలో నిజం లేదంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహ వేడుకల తాలుకు స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ యాభైకోట్లకు కొన్నట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రచారంలో నిజం లేదని నాగచైతన్య టీమ్ పేర్కొన్నది.