33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

మంచు ఫ్యామిలీ డ్రామాకు హ్యాపీ ఎండింగ్?

మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాలకు తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని ఇలా పెంచుకుంటే అది పెరిగిపోతూనే ఉంటుందని.. కుటుంబ వ్యవహారాలను బిగ్ బాస్ షోలా మీడియా, సోషల్ మీడియా ప్రజల ముందు ఉంచుతుందని వీలైనంత త్వరగా కట్ చేసుకుంటే మంచిదని మోహన్ బాబుకు సన్నిహితులు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై బయట జరిగే ప్రచారాలకు అంతం ఉండదని అంటున్నారు. దీంతో మోహన్ బాబు కూడా తన సన్నిహితులకు మనోజ్ తో సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మనోజ్‌కు తల్లి, సోదరి సపోర్టు

మనోజ్‌ కుటుంబంలో ఒంటరి కాదని ఆయనకు తల్లి తో పాటు సోదరి లక్ష్మి సపోర్టు కూడాఉందని చెబుతున్నారు. తల్లి ఇప్పటి వరకూ బయటకు రాలేదు కానీ.. మనోజ్ ధైర్యంగా ఇప్పటికీ ఇంట్లోనే ఉండటానికి తల్లే కారణమని అంటున్నారు. మనోజ్, మౌనిక బిడ్డను ఆమె సంరక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. మనోజ్ ను బయటకు పంపేయడానికి కుటుంబంతో సంబంధం లేదని చెప్పడానికి తల్లి అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చాలని అనుకున్నప్పటికీ.. టెస్టుల తర్వాత ఇంటికి వచ్చేశాయని మనోజ్ బిడ్డ కోసమేనని చెబుతున్నారు.

అసలు వివాదమేంటో లేని స్పష్టత

ఆస్తుల వివాదం కాదని మనోజ్ అంటున్నారు. విష్ణు తన తండ్రి మాట జవదాటనని అంటున్నారు. ఆయనఆస్తులు ఆయనిష్టం అంటున్నారు. అసలు సమస్య ఏమిటో మాత్రం స్పష్టత లేదు. మధ్యవర్తులు చర్చలు జరిపితే మనోజ్ తో సమస్య పరిష్కారం అయిపోతుదంని అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇక సమస్యలు ఉండవని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు కూడా ఇది కుటుంబ వివాదమని పోలీసులు, మీడియా ఎక్కువ జోక్యం చేసుకోవద్దని చెప్పేసింది. శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని ఇద్దరు కుమారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

సమస్య పరిష్కారమైనా కుటుంబం కలవడం కష్టమే

ప్రస్తుతం ఏదో విధంగా సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ ప్రస్తుతం జరిగిన పరిణామాలతో అందరూ మరోసారి కలవడం కష్టమేనని భావిస్తున్నారు. మనోజ్ పై మోహన్ బాబు, విష్ణుతో పాటు వారి కుటుబంంలో కీలకంగా మారిన వినయ్ అనే వ్యక్తి కూడా వ్యతిరేకంగా ఉన్నారని జరుగుతున్న పరిణామాలతో స్పష్టమవుతోందని చెబుతున్నారు. మనోజ్ కూడా.. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు రాజీపడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నారని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com